93
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం NH 16 జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇథనాల్ కెమికల్ లోడు ట్యాంకర్ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఆదివారం తెల్లవారుజామున డివైడర్ మీదకు దూసుకుపోయింది. అయితే ప్రమాద సమయంలో లారీ కొంతమేర డివైడర్ మధ్యలో ఉన్న ఇనపరైలింగ్ ధ్వంసం చేసుకుంటూ దూసుకు వెళ్లి నిలిచింది. ఈ ప్రమాదంలో లారీ తిరగబడిన, లేదా ట్యాంకర్ పగిలిన పెను ప్రమాదం సంభవించేదని పలువురు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీస్, హైవే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ట్రాఫిక్ నియంత్రించారు.