78
నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన బస్సు అగ్ని ప్రమాదంకు గురైంది. నెల్లూరు నుండి విద్యుత్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో బస్సులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో బస్సు అద్దాలు పగలగొట్టి, ధర్మల్ కేంద్రం ఉద్యోగులంతా సురక్షితంగా బయటపడ్డారు. పూర్తిస్థాయిలో బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది.