తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది.

Advertisements

<p>తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది&period; పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్‌ను కేజీకి రూ&period; 20 నుండి రూ&period; 8కి తగ్గించడంతో నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నార పెరిగిన ధరలు&comma; నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు&period; ఈ బంద్ వల్ల హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోనుంది&period; ముక్కలేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే&period; ఎందుకంటే నేటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి&period; నిరవధిక బంద్ పాటించనున్నట్లు చికెన్ దుకాణాల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు&period; హైదరాబాద్‌ మహా నగరంలో కూడా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది&period; పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; గతంలో కేజీకి రూ&period;15 నుంచి రూ&period;20గా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం రూ&period;8 నుంచి రూ&period;10కి తగ్గించటంతో తీవ్రంగా నష్టపోతున్నాంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.