93
క్రిస్మస్ వేడుకలు మందమర్రి పట్టణంలో క్రైస్తవులు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీసు జన వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా చర్చిల్లో పశువుల పాకను ఏర్పాటు చేశారు. చిన్నారులు వేసిన క్రిస్మస్ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. మందమర్రి పట్టణం ఒకటవ జోన్ లోని సి.యస్.ఐ చర్చ్ ఫాదర్ రెవ.జెర్మీయా ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. సర్వ మానవాళి యేసు చూపిన శాంతి మార్గంలో నడవాలన్నారు. అనంతరం క్రిస్మస్ పండగ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
Read Also..