81
అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి మండల పరిధిలోని దిగువరెడ్డిపల్లె, చిన్న ఓరంపాడు, ముక్కవారిపల్లె గ్రామాలలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. నష్ట తీవ్రతను గుర్తించి రైతులను అడిగి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందేలా చూస్తామన్న కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారితో పాటు రాజంపేట ఆర్డీవో రామకృష్ణారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవిచంద్రబాబు, పుల్లంపేట తహసిల్దార్ నరసింహ కుమార్ తో పాటు ఓబులవారిపల్లె తహసిల్దార్, ఎంపీడీవోలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు..