బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటాపోటీ….

BRS and Congress

Advertisements

&NewLine;<p>జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది&period; జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోంది&period; తాజాగా 214వ పోలింగ్ బూతు దగ్గర బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడి జరిగింది&period; ఒకరిమీద ఒకరు రాళ్లదాడులు&comma; బూతులతో ఘర్షణకు దిగారు&period; అంతకు ముందు ఉదయం జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూతు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువసేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటున్నారని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది&period; వాగ్వాదంగా మొదలై&period;&period; ఘర్షణకు దారి తీసింది&period; మొదట జనగామ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యమవుతుందని అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్లినట్టుగా బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు&period; అయితే&comma; ఈ క్రమంలో పార్టీ కండువాలు కప్పుకుని వస్తున్నారని&comma; ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని&period;&period; ఎక్కువ సమయం బూత్ లలో ఉంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగాగ అది ఘర్షణకు దారితీసింది&period; ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కలగచేసుకుని ఇరు వర్గాలను కేంద్రాల దగ్గరినుంచి బైటికి పంపారు&period; గొడవ సద్దుమణిగి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు&period; మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .

మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.