ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది.

Advertisements

<p>ఇరాన్&comma; అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది&period; హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది&period; ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జలసంధిని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ దాడి చేసినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి&period; మరోవైపు&comma; పాకిస్థాన్ జెండా చాటున చమురును అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నారని&comma; దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; ట్యాంకర్‌కు మంటలు అంటుకుని&comma; పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period; ఈ ఘటనలో సిబ్బంది ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రాలేదు&period;<&sol;p>&NewLine;<p>ఫిబ్రవరి 28à°¨ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుంది&period; తమ అనుమతి లేకుండా ఏ నౌక ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది&period; దీంతో ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం స్తంభించిపోగా&comma; 85కి పైగా ట్యాంకర్లు గల్ఫ్‌లోనే చిక్కుకుపోయాయి&period; మార్చి 11à°¨ కూడా థాయ్‌లాండ్‌కు చెందిన నౌకపై దాడి జరిగింది&period;ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి&period; సంక్షోభం ముదరకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలోనే మరోసారి ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు దాడులు కొనసాగుతున్నాయి&period; మరోవైపు బహ్రెయిన్‌&comma; ఖతార్‌&comma; యూఏఈ తదితర గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ తన దాడులు కొనసాగించింది&period; చైనా &OpenCurlyQuote;బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌’లో భాగంగా తమ దేశంలో నిర్మాణ దశలో ఉన్న ముబారక్‌ అల్‌ కబీర్‌ పోర్ట్‌పై దాడి జరిగిందని కువైట్‌ తెలిపింది&period; గల్ఫ్‌లో చైనా అనుబంధ ప్రాజెక్టుపై దాడి జరగడం ఇదే మొదటిసారి&period;<br &sol;>&NewLine;ఇరాన్ సైనిక స్థావరాలు&comma; క్షిపణి తయారీ కేంద్రాలు&comma; ఆయుధ నిల్వలు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు నిర్వహిస్తోంది&period; ఈదాడుల్లో బుషెహర్ ప్రావిన్సులోని ఐఆర్జీసీ&comma; నేవీ&comma; వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది&period; ఈ దాడులు బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌కు సమీపంలోనే జరిగినట్లు వార్తలు వచ్చాయి&period; దీనితో రేడియేషన్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరిగిన దాడులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది&period; ఈ అణు కేంద్రానికి జరిగే నష్టం&comma; దీర్ఘకాలంలో రేడియోలాజికల్ ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించింది&period; ఆ ప్లాంట్‌లో పెద్ద మొత్తంలో అణుపదార్థాలు ఉన్నట్టు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసి పేర్కొన్నారు&period;ఎక్కువ మొత్తంలో అణుపదార్థాలు నిల్వ ఉన్న ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు ప్రమాదం జరిగితే&comma; రేడియేషన్ లీకేజీ వల్ల ఇరాన్‌తో పాటు ఆ దేశం వెలుపల భారీస్థాయిలో ప్రమాదం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది&period; ఇలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు&period; ఈ మేరకు ఆయన &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi; వేదికగా హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.