91
శ్రీకాకుళం జిల్లా… ఇచ్చాపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు దళిత సంఘాలు, వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పన్ పిరియా విజయసాయిరాజ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ సమన్యాయం కల్పిస్తూ భిన్నత్వంలో ఏకత్వం తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించారని అన్నారు. చిన్ననాడు ఎంతో వివక్షకు గురైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అత్యున్నత విద్యార్హతలతో భారత రాజ్యాంగాన్ని రచించిన స్థాయికి ఎదిగారని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పరిపాలనలో చూపిస్తున్నారని.. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని అన్నారు.
Read Also..