సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం.

Advertisements

<p>సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో విషాదం చోటుచేసుకుంది&period; వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు&period; మృతులంతా పటాన్‌చెరులోని శిరీష మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p>వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు చెరువులోకి దిగినట్లు సమాచారం&period; లోతైన గుంతను గుర్తించకపోవడంతో ఒక విద్యార్థి నీటిలో జారిపడగా&period;&period; అతడిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయారు&period; ఈత వచ్చిన ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు&period; మృతుల్లో బీటెక్&comma; పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఘటనపై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు&comma; రెస్క్యూ సిబ్బంది&comma; లైఫ్ జాకెట్లు&comma; ఈతగాళ్ల అందుబాటుపైనా విచారణ కొనసాగుతోంది&period; ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి&comma; బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు&period; పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని&comma; ఆస్పత్రిని సందర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.