బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తి.

Advertisements

<p>గుంటూరు జిల్లా తెనాలిలో ఆశ్రయం ఇచ్చిన బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పి నెల రోజులుగా బంధువు ఇంట్లో ఉంటున్న జాగర్లమూడి భరత్&period;&period; ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేశాడు&period; అనంతరం ఇంటి వద్ద ఉన్న TVS స్టార్ సిటీ మోటార్‌సైకిల్‌ను తీసుకుని పరారయ్యాడు&period;<&sol;p>&NewLine;<p>తెనాలి ఐతానగర్‌లో జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period; సీసీ కెమెరాలు&comma; ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు&period;&period; సెప్టెంబర్ 16à°¨ తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు&period; అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో సుమారు 40 గ్రాముల బంగారు గొలుసు&comma; 15 గ్రాముల పూసల గొలుసు&comma; 18 గ్రాముల మరో బంగారు గొలుసు&comma; మోటార్‌సైకిల్ ఉన్నాయి&period; వీటి మొత్తం విలువ సుమారు రూ&period;7&period;50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు&period; నిందితుడిని త్వరితగతిన అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.