పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి…

పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి

Advertisements

<p>రైలు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు&period; ఈ షాకింగ్ ఘటన పాకిస్తాన్‌లోని అశాంత పీడిత బలూచిస్తాన్ ప్రావిన్స్‌ చోటు చేసుకుంది&period; క్వెట్టా-చమన్‌ ఫాటక్‌ రైల్వే ట్రాక్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు&period; ఈ భీకర పేలుడు ధాటికి మహిళలు&comma; చిన్నారులతో సహా మొత్తం 23 మంది అక్కడికక్కడే మరణించగా&comma; 47 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు&period; పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారగా&comma; సమాచారం అందుకున్న పాకిస్తాన్ భద్రతా బలగాలు&comma; రెస్క్యూ టీమ్స్ క్షతగాత్రులను క్వెట్టాలోని సివిల్ ఆసుపత్రికి తరలించాయి&period; ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి విధించి వైద్యులు చికిత్స అందిస్తుండగా&comma; గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>ఈ ఘోర ఉగ్రదాడి వెనుక బలూచిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ అయిన &&num;8216&semi;బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ&&num;8217&semi; హస్తం ఉన్నట్లు భద్రతా సంస్థలు తెలిపాయి&period; బలూచిస్తాన్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా రైల్వే మౌలిక సదుపాయాలు&comma; భద్రతా బలగాలు మరియు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడుతున్నారు&period; ఈ ఘటనను పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు&period; నిరపరాధులైన మహిళలు&comma; చిన్నారులపై దాడులకు పాల్పడే ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని&comma; వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం ఇటుక బట్టీలో ప్రమాదం.

హైదరాబాద్‌లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..