నిజామాబాద్ శివారులోని న్యాల్కల్‌లో భర్తను హతమార్చిన భార్య.

Advertisements

<p>వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు&period; బిల్డింగ్‌పై నుంచి తోసేసినా చనిపోకపోవడంతో&&num;8230&semi; టాయిలెట్‌ క్లీనింగ్‌ కోసం వినియోగించే హార్పిక్‌ను భర్త నరాళ్లోకి ఎక్కించి కడతేర్చింది&period; ఈ ఘటన నిజామాబాద్ జిల్లా న్యాల్కల్‌లో చోటుచేసుకుంది&period;<&sol;p>&NewLine;<p>భర్త ఉద్యోగం నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు&period;&period; భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది&period;&period; ఇటీవల గల్ప్ నుంచి భర్త ఇంటికి తిరిగి రావడంతో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని భావించిన భార్య అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది&period;&period; ప్రియుడితోపాటు&period;&period; అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తి సహాయంతో భర్తను హత్యచేసింది&period; అయితే&comma; తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని&period;&period; తన కోడులు ఇందుకు కారణమై ఉండొచ్చునని మృతుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది&period;&period; దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అసలు గుట్టు వీడింది&period;<&sol;p>&NewLine;<p>నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ గల్ఫ్ లో ఉద్యోగం చేస్తూ జూన్ 27à°¨ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు&period; అయితే&comma; అతని భార్య దాయిని సంధ్యకు నిజామాబాద్ ఇంద్రపూర్ కాలనీకి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది&period; భర్త ప్రశాంత్ రాకతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతాడని భావించిన సంధ్య&comma; ప్రియుడు అనిల్‌తో కలిసి భర్త ప్రశాంత్ హత్యకు ప్లాన్ చేసింది&period; దీంతో అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం తీసుకుని&period;&period; పథకం ప్రకారం&period;&period; జూన్ 29à°¨ వెంకటసాయి ప్రశాంతకు పరిమితికి మించి మద్యం తాగించి డాబాపైకి తీసుకెళ్లాడు&period;<&sol;p>&NewLine;<p>సంధ్య ఫోన్లో సూచనలు ఇస్తుండగా ప్రశాంత్‌ను వెంకటసాయి డాబా పైనుంచి కిందకు నెట్టేశాడు&period; తీవ్ర గాయాలైనప్పటికీ ప్రశాంత్ చనిపోక పోవడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య&comma; వెంకటసాయి కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రశాంత్ ను చికిత్స నిమిత్తం తరలించారు&period; అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో&period;&period; అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు&period; చికిత్స అనంతరం రాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చాక మళ్లీ ప్రశాంత్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>ప్రియుడు అనిల్ సూచనతో సంధ్య తన భర్త ప్రశాంత్ చేతికి ఉన్న సెలైన్ కాన్యులా ద్వారా మత్తుమందులు&comma; టాయిలెట్ క్లీనర్ కలిపిన ద్రవణాన్ని శరీరంలోకి ఎక్కించింది&period; ఆపై మంచంపై నుంచి కిందకుతోసి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసింది&period; అయితే&comma; ప్రశాంత్ మృతివార్త తెలుసుకున్న అతని తల్లికి అనుమానం వచ్చింది&period; ప్రశాంత్ ను హత్యచేశారని భావించిన ఆమె&period;&period; తన కోడల్ని అనుమానించింది&period; ఊరు వచ్చిన విషయం గానీ&comma; మరణించే వరకు జరిగిన విషయాలుగానీ కోడలు తనకు చెప్పకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది&period; కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు&period; మృతుడు భార్య సంధ్యను విచారించగా అసలు విషయం గుట్టు రట్టు అయింది&period; దీంతో సంధ్యతోపాటు ఆమె ప్రియుడు అనిల్&comma; మరో వ్యక్తి వెంకటసాయిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.