72
సన్ బర్న్ కు అనుమతి లేకుండా టిక్కెట్ లు విక్రయిస్తుండటంపై మాదాపూర్ అడిషనల్ డిసిపి నంద్యాల నరసింహారెడ్డి మండిపడ్డారు. అనుమతి తీసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్ లో డ్రగ్స్ ను తీసుకువచ్చినా, అనుమతించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఈవెంట్ లో మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సిసి కెమెరాలు కూడా అమర్చుకోవాలని అడిషినల్ డిసిపి సూచించారు. సన్ బర్న్ నిర్వాహకుల గత చరిత్రను కూడా పరిశీలిస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలకు ఇప్పటివరకు 22 మంది అనుమతి కోసం దరఖాస్తు చేశారని. పబ్బులలో అనుమతికి మించి ప్రవేశం లేదని నరసింహారెడ్డి స్పష్టం చేశారు.