సింగరేణి కార్మికుల ప్రాణాలను యాజమాన్యం బలితీసుకుంటుందని ఆరోపిస్తూ కార్మికులు విధులు బహిష్కరించారు.దీంతో యాజమాన్యం బొగ్గు గనికి మొదటి షిప్టు లాకౌట్ ప్రకటించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెవన్ ఇంక్లైయిన్ బొగ్గు గనికి చెందిన కార్మికుడు కౌటం సంపత్ ఇంటి నుండి నైట్ షిప్టు డ్యూటికి వెళ్లుతుండగా మార్గమధ్యలో ముందు వెళ్లుతున్నలారీ నుండి బొగ్గు పెల్లలు మీద పడటంతో సంపత్ అక్కడిక్కడే మృతి చెందాడు.నూతన రహదారికి అధికంగా స్పీడ్ బ్రేకర్లు,మూల మలుపు ఉండటం, అధిక దూర భారంతో కార్మికులు తరుచూ రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారని కార్మికులు ,కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించక పోవటంతో ప్రమాదాలు జరుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాత రోడ్డును కార్మికులు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల , పాత రహదారి మూసివేయటం వల్ల ఇప్పటికే 8 మంది కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఎంత మంది….!
70
previous post