చిత్తూరు, రాత్రి వేళలో ఇంటి దొంగతనాలకు మరియు బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పలమనేర్ పోలీసులు. సుమారు 30 లక్షల విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రెండు కార్లు స్వాధీనం. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్ దగ్గర అరెస్ట్ చేసిన పోలీసులు.ముద్దాయిల పైన మన రాష్ట్రం తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా పలు కేసులు కలవు. ఇతర రాష్ట్రాల పోలీసులు వెతుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పలమనేర్ సబ్-డివిజన్ పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఐ.పి.ఎస్. పలమనేరు, పుంగనూరు, కుప్పం సర్కిల్ల పరిధిలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి డి.ఎస్.పి. ఎన్.సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలోని పుంగనూరు, సదుం, గంగవరం మరియు రామకుప్పంలో రాత్రి సమయంలో జరిగిన దొంగతనాలను ఛేదించు క్రమంలో పలమనేరు డి.ఎస్పీ పోలీసులను 4 బృందాలుగా ఏర్పర్చి ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు అంతట వారి గురించి విచారణ జరిపించగా కేవలం ఇళ్ళలోనే కాకుండా బ్యాంకు దోపిడిలు కూడా చేసేవారని నిర్ధారణకు వచ్చారు. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు పుంగనూరు ఎస్.ఐ. సుకుమార్ మరియు సిబ్బంది పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్ దగ్గర మోస్ట్ వాంటెడ్ అయిన ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగలైన రమేష్, గోవిందరాజు, శ్రీనివాసులను, గవియప్ప, గణేష్ మరియు అశ్వత్ నారాయణ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30 లక్షలు విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 5 లక్షలు విలువ గల రెండు కార్లను స్వాదీనం చేసుకున్నారు. వీరిని విచారించగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని తాళాలు పగలుకొట్టి ఇళ్ళల్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడేవారని మరియు ఈ ముఠాకు నాయకుడైన రమేష్ కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో బ్యాంకు దొంగతనాలకు పాల్పడేవాడని విచారణలో తెలియజేసారు. ఈ ముఠా దొంగతనం చేసిన తరువాత బంగారాన్ని రమేష్, శ్రీనివాసులు వారి వారి బందువులకు ఇచ్చి ముత్తుట్ ఫైనాన్సు మరియు ATTICA గోల్డ్ కంపెనీ నందు అమ్మేసి సొమ్ము చేసుకునేవారని విచారణలో తెలియజేసారు .ఇతర రాష్ట్రాలలో కూడా మోస్ట్ వాంటెడ్ అయిన రమేష్ మరియు అతని అనుచరులను ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసిన పలమనేరు సబ్-డివిజన్ పోలీసులను జిల్లా ఎస్పీ క్యాష్ రివార్డ్ మరియు సర్టిఫికెట్స్ తో అభినందించారు.
రాత్రి వేళ లో అంతరాష్ట్ర దొంగల హల్ చల్
53
previous post