శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు

Advertisements

<p>దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి&period; భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు&comma; సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు&period; ప్రభుత్వ విప్&comma; వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి&period; ఆలయ పునర్నిర్మాణ&comma; అభివృద్ధి పనుల కారణంగా స్వామివారి ప్రత్యక్ష దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయగా&comma; స్వామివారికి ఏకాంత సేవలు&comma; నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి&period; భక్తుల ఆధ్యాత్మిక భావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేసి భక్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆలయ ఈవో&comma; సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పనుల పురోగతిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు&period; అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం భక్తులకు మరింత సౌకర్యవంతమైన&comma; వేగవంతమైన దర్శన వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపారు&period; త్వరలోనే రాజరాజేశ్వర స్వామివారి దర్శనాలు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు&comma; ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు&period; భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాజన్న దర్శనాలను పునఃప్రారంభించే దిశగా పనులు కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.