అయోధ్య విరాళాల కేసులో చంపత్‌రాయ్‌కు క్లీన్‌చిట్‌.

Advertisements

<p>అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; ఆలయ ట్రస్ట్‌ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది&period; ట్రస్ట్‌ మాజీ సభ్యుడు అనిల్‌ మిశ్రాకు కూడా కేసుతో సంబంధం లేదని తేల్చింది&period; ఈ కేసుపై దర్యాప్తు పూర్తిచేసిన సిట్‌ తుది నివేదికను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌ హోంశాఖ అందించింది&period;<br &sol;>&NewLine;విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చంపత్‌రాయ్‌&comma; అనిల్‌ మిశ్రా జూన్‌ 27à°¨ తమ పదవులకు రాజీనామా చేశారు&period; అనంతరం సిట్‌ వారిద్దరినీ విచారించింది&period; ఆలయానికి వచ్చిన విరాళాల సేకరణ&comma; నగదు నిర్వహణపై వివరాలు సేకరించింది&period; విచారణలో చంపత్‌రాయ్‌ తనకు ఎలాంటి సంబంధం లేదని&comma; అక్రమాల విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేశానని ఆయన దర్యాప్తు అధికారులకు వివరించారు&period;ఈ కేసులో లక్నో డివిజనల్‌ కమిషనర్‌ విజయ్‌ విశ్వాస్‌ పంత్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో సిట్‌ ఏర్పాటైంది&period; రేంజ్‌ ఐజీ కిరణ్‌ ఎస్‌&comma; ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్‌రతన్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు&period; జూన్‌ 23à°¨ సిట్‌ ప్రాథమిక నివేదిక సమర్పించింది&period; దాని ఆధారంగా జూన్‌ 25à°¨ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది&period; మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు&period; వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.