స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

Advertisements

<p>చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది&period; వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో&period;&period; దర్శన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు&period; బుధవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వామివారిని దర్శించుకోగా&period;&period; ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;<p>స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఎంపీకి తీర్థప్రసాదాలు&comma; శేషవస్త్రం&comma; స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు&period; మరోవైపు దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు&period; ఉచిత దర్శనంతో పాటు రూ&period;150&comma; రూ&period;100 దర్శన క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>అనంతరం నిత్య అన్నదాన భవనాన్ని సందర్శించిన ఈఓ పెంచల కిషోర్&period;&period; భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు&period; భోజనం నాణ్యత&comma; రుచిపై భక్తులను అడిగి తెలుసుకున్నారు&period; భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు&period; కార్యక్రమాల్లో ఆలయ అధికారులు&comma; సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.