ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)రాష్ట్రం వారణాసి(Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయం(Kashi Vishwanatha Temple)లో విధులు నిర్వర్తించే పోలీసులు దోతి కుర్తా(Dhoti Kurta) ధరించారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్కోడ్గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల తయారీ..
విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.