కాశీ(Kashi Punya Kshetra) లేదా వారాణసి(Varanasi)…
భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు ఉప నదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది. బ్రిటిషువారి పాలన సమయంలో వారణాసి, బెనారస్ అయింది.
కాశ్యాన్తు మరణాన్ ముక్తి…
“కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది” – అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు(Jains) కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది.
పురాణకథనాలు చరిత్ర…
సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పురాణ కధల ద్వారా తెలుస్తుంది. హిందువుల ఏడు పవిత్ర నగరాలలో కాశీ ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం(Mahabharata), స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది.
పురాణకథనాలు: కాశీ శివ స్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్ళారు. అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి నగారాలు. ప్రపంచంలో నిరంతరంగా నివాస యోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉంది. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదకాల ప్రజలిక్కడ నివసించారు. 8వ శతాబ్దంలో 23వ జైన(Jain) గురువు మరియు ఆరంభకాల తీర్ధ గురువు అయిన పర్ష్వ జన్మస్థానం.
కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు…
- కాశీ విశ్వనాధుని దేవాలం
- అన్నపూర్ణాలయం
- విశాలాక్షి ఆలయం
- కాల భైరవాలయం
- మృత్యుంజయేశ్వరాలయం
- సారనాద్ మందిరం
- వ్యాస కాశి
- దండపాణి మందిరం
- చింతామణి గణపతి మందిరం
- బిర్లా టెంపుల్
- సంకట విమోచన హానుమాన్ మందిరం
- శ్రీ త్రిదేవి మందిరం
- దుర్గా మందిరం
- తులసి మానస మందిరం
- గవ్వలమ్మ మందిరం
- కేదారేశ్వర మందిరం
- తిలబండేశ్వరాలయం
- జంగన్ వాడి మఠ్
- గంగా హారతి
- బిందు మాధవుడు
- వారాహిదేవి
- దత్తమందిరం ( దత్తపీఠము )
ఇలా కాశీలో ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు.చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 23 వేలకుపైగా దేవాలయాలున్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ బంగారం విరాళం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.