గుండుపై శ్రీరాముడి అడుగులు ఘన చరిత్ర(Solid history):
కరీంనగర్ జిల్లా(Karimnagar District)లో రామడుగు అనే ప్రాచీన గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం నుంచి రాముడు వనవాసం కోసం వెళ్లారు. అంతే కాదు ఓ గుండుపై రాముడు ఆడుగులు కనబడుతున్నాయి. రాముడు ఇక్కడ అడుగువేయడంతో.. రామడుగు అని పేరు వచ్చింది. అంతేకాదు ఈ గ్రామం పక్కన ఎత్తైన కొండలు కోటలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రోజుల పాటు రాముడు నివసించి తరువాత రామగిరిఖిల్లా మీదగా భద్రచలం వైపు వెళ్లినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు ఈరాయి చుట్టు శ్రీరాముడు విగ్రహాలు(Idols of Lord Rama) హనుమాన్ విగ్రహాలు(Idols of Hanuman) కూడా ఉన్నాయి. శ్రీరాముడి పాదం రెండు ఫీట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావడంతో ఇక్కడ రాముడు అడుగుల గురించి చర్చించుకుంటున్నారు. రాముడి ఆడుగులు చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
శ్రీరామ నవమి రోజన ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచే రాముడు వెళ్లడంతో ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు స్థానికులు. ఇతర గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడి వచ్చి రాముడి పాదాలు చూసి వెళుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ శిల్పులు అధిక సంఖ్యలో ఉన్నారు. వివిధ రకాల శిల్పాలు తయారు చేస్తూ ఉపాధి కుడా పొందుతున్నారు. తాము కూడా అయోధ్య వెళ్ళి రామమందిరం చూస్తామని చెబుతున్నారు. ఇక్కడ రాముడు అడుగులు ఉండటంతో రామడుగు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు రాముడి పాదాలను చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మికత కలిగి ఉన్న రామడుగు అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని అంటున్నారు. కనీసం ఇక్కడికి రావడానికి సరైన దారి కూడా లేదని వాపోతున్నారు ప్రజలు. బండ పైకి ఎక్కడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు.
ఇది చదవండి: భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి