శ్రీశైలం(srisailam)
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఘనంగా ముగిశాయి చివరి రోజైన నేడు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి అశ్వవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నులపండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ఈపూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. వాహనపూజలనంతరం
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో(Mahashivratri Brahmotsavam) ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణం శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో శ్రీస్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించి 9 రకాల ఫలాలు నివేదించబడ్డాయి. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. ఈ శయనోత్సవానికి ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల శయనమందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంతసేవ నిర్వహించారు. ఈపూజ కైకర్యాలతో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటితో ఈఏడాది శ్రీస్వామి అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి