తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందడి మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రారంభమైంది. పండుగకు స్వాగతం పలుకుతూ గాంధీ పార్క్, వినాయక్ నగర్, నేరేడ్మెట్, మీర్జాల్గూడ, బాలసరస్వతి నగర్ తదితర కాలనీల్లో భారీ స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. రంగురంగుల అలంకరణలతో కాలనీలు పండుగ శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, బోనం సమర్పణలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థానిక కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల రాకతో మల్కాజ్గిరి ప్రాంతం ఆధ్యాత్మిక, పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది.
Devotional
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు. ప్రాణదాన ట్రస్టు సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని దాతలు తెలిపారు. విరాళం అందించిన సంస్థ ప్రతినిధులను టీటీడీ అధికారులు అభినందించారు. ఈ నిధులు ట్రస్టు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని వెంకయ్యచౌదరి వివరించారు.
లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆరుగురు సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది. బోనాలు, దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా రంగ రమేష్ గౌడ్, ఎ.మాణిక్ ప్రభు గౌడ్, పోసాని విజయ్ కుమార్, సి.హెచ్.వెంకటేష్, బంగ్లా రాజు యాదవ్, కె.రవిరాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాల్ దర్వాజా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ యేడు బోనాలు, విజయదశమి ఉత్సవాల వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా అందరిని కలుపుకుని ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఆలయ శిఖర పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఆదివారం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని తీసుకు వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బోనాల ఉత్సవాలకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, హిందూ పండుగలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే రాబోయే గణేష్ ఉత్సవాలతో పాటు అన్ని హిందూ పండుగలకు తగిన నిధులు విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు.
ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆస్ట్రేలియా సహాయ మంత్రి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాశస్త్యం, అమ్మవారి చరిత్రను అర్చకులు వివరించారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాశస్త్యం, అమ్మవారి చరిత్రను అర్చకులు వివరించారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాలకు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. బోనాల ఏర్పాట్లపై నిర్వహించిన కో-ఆర్డినేషన్ సమావేశంలో అధికారులు భక్తుల సౌకర్యానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు, సాధారణ భక్తుల కోసం రెండు జనరల్ లైన్లు, పాస్దారుల కోసం మరో రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జోగినీలకు బాట నుంచి అనుమతి కల్పించనున్నట్లు వెల్లడించారు. రంగం కార్యక్రమం సందర్భంగా స్వర్ణలతకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. ఈ నెల 31 నుంచి 10 క్రైమ్ టీమ్‌లు విధుల్లో ఉండి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచనున్నాయి. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, వీఐపీలు వచ్చినా సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖకు చెందిన అధికారుల పాత్ర, విధుల నిర్వహణలో జరిగిన లోపాలపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు బి. ఉమామహేశ్వరరావును విచారణాధికారిగా నియమించగా, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్‌రావును ప్రెజెంటింగ్ అధికారిగా నియమించింది. విచారణను నిష్పాక్షికంగా నిర్వహించి, సంబంధిత అధికారుల బాధ్యతలు, విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల అమలులో జరిగిన లోపాలు, పర్యవేక్షణలో వైఫల్యాలపై సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. ఈ శాఖాపరమైన విచారణను మూడు నెలల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు నేపథ్యంలో ఇప్పటికే సిట్ విస్తృతంగా దర్యాప్తు నిర్వహించింది. ఆ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సంబంధిత అధికారుల పాత్రపై కూడా విచారణ అవసరమని సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ప్రసాదం నాణ్యత, భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ శాఖాపరమైన విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.
చిత్తూరు జిల్లా కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, అభివృద్ధి పనులు, టెండర్లపై విస్తృతంగా చర్చించారు. ప్రతి నెల జరిగే సంకష్టహర చతుర్థి బంగారు రథోత్సవ సేవ టికెట్ ధరను రూ.5 వేలుగా నిర్ణయిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే భక్తులకు మోదక ప్రసాదం అందించే ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యూ లైన్లు, మాడ వీధుల్లో వేచి ఉండే భక్తులకు తాగునీటి సదుపాయాలు మెరుగుపర్చేందుకు కొత్త సిబ్బంది నియామకానికి అంగీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఇంజినీరింగ్ పనుల టెండర్లకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం శ్రీ శక్తి పీఠంలో ఘనంగా వారాహి ఉత్సవాలు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, వారాహి మంత్ర హోమాల్లో పాల్గొంటున్నారు. తిరుమల–తిరుపతి ప్రాంతమంతా వరాహ శక్తి ఆధీనంలోనే ఉందని, శ్వేత వరాహకల్పంలో భూదేవిని ఉద్ధరించిన వరాహమూర్తి శక్తి స్వరూపమే శ్వేత వారాహి దేవి అని శ్రీ శక్తి పీఠాధిశ్వరి మాతాజీ రమ్యానంద భారతి తెలిపారు. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే కోరికలు నెరవేరి, జీవితంలోని అడ్డంకులు తొలగుతాయని పేర్కొన్నారు. జూలై 23న వారాహి అమ్మవారి కళ్యాణోత్సవం, జూలై 25న వారాహి హోమం పూర్ణాహుతితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నట్లు వెల్లడించారు.
శ్రీనివాస మంగాపురంలో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం.
తిరుపతి రూరల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే చారిత్రక ప్రాధాన్యత ఉన్న శ్రీవారిమెట్టు ప్రాంతంలో ఈ వేడుక కనులపండువగా సాగింది.ఆలయం నుంచి ఉత్సవమూర్తులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ కోలాహలంగా ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు.