58
ప్రకాశం జిల్లా.. ఆర్టీసి సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసి సిబ్బంది ధర్నా చేపట్టారు. ఆర్టీసి డిపో ఎదుట జిల్లా ప్రజారవాణా అధికారి వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా నిబందల పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారని యూనియన్ సభ్యులు మండిపడ్డారు. బస్సు మరమ్మత్తులకు కూడా డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు.
Read Also..