రాయదుర్గం లో వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో కరువు రైతులను ఆదుకోవడానికి వెంటనే ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారముకై పంటల రుణాలను రద్దుచేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాయదుర్గం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతపురం జిల్లా సిపిఐ కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినాయి గత 50 సంవత్సరాలలో లేని కరువు ఈ సంవత్సరం వచ్చింది వర్షాలు రాకపోవడంతో లక్షలాది ఎకరాలలో పంటలు వేయలేదు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయినాయి దీనివల్ల లక్షలాది రూపాయల పంట నష్టము జరిగిందన్నారు. జిల్లాలో 31 మండలాల్లో కూడా పూర్తిగా కరువు ఏర్పడింది మరో పక్క హెచ్ ఎల్ సి కెనాల్ నీరు రాకపోవడంతో ఆయకట్టు కింద ఉన్న భూములు బీడుగా మారాయి హంద్రీనీవా నుండి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు భూములను బీడ్లుగా మారి రైతులు వలసలు వెళ్తూ తీవ్ర దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. బోరు బావుల కింద వేసిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోతున్నాయి ఇప్పటికే వరుస కరువుల వల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయారు అప్పుల మీద అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామాలలో తాగునీరు కూడా గ్రామ ప్రజలకు అందకుండా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైతులు వ్యవసాయక పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక సహకారాలు అందించలేదు జిల్లా అంతట కరువు ఉంటే కేవలం 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప రైతా గాని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జిల్లా అంతట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిస్తూ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది.
సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా..
76
previous post