79
విజయవాడ రాణి గారి తోటలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రెండు నెలల కిందట పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్నవారికి కంటి చికిత్సలు చేయించి, ఈ రోజు షుమారు 1000 మందికి కళ్ళజోళ్ళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ” ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి ప్రజలకు సేవ చేస్తున్నామని, జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజల వద్దకు చేరి ఉంటే, ఈరోజు ఇంతమంది ప్రజలు తమ శిబిరాన్ని ఆశ్రయించేవారు కాదని ఎద్దేవా చేశారు…. కార్యక్రమం అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..