పశువుల తో పాటు పొలం వెళ్లిన పెంపుడు కుక్క పొలం మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన బాంబును కొరికి పేలుడు ధాటికి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం బండివెలిగండ్ల పంచాయతీ గంగపాలెం లో చోటుచేసుకుంది. రైతు పుల్లారెడ్డి తెలిపిన వివరాల మేరకు పశువులను మేపుకోవడాని పొలం వెళ్లానని తనతో పాటు తన పెంపుడు కుక్క కూడా వచ్చిందని పొలంలో అటూఇటూ తిరుగుతూ బాంబు ఉన్న ప్రదేశానికి కుక్క వెళ్లిందని అది ఏమిటి అని పసిగట్టి దానిని కొరకడంతో ఒక్కసారిగా అది పేలి కుక్క దవడ మొత్తం చీలిపోయి అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపాడు.ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబును పొలం పెట్టినట్లు తెలిపారు.అడవి పందుల తాకిడి తట్టుకోలేక ఎవరో ఈ పని చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
బాంబు పేలి కుక్క మృతి…
66
previous post