78
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇళ్ళ కొరత లేకుండా చేస్తాం అని అలానే సత్తుపల్లి,అశ్వారావుపేట నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా అయ్యేలా కృషి చేస్తాం అని సత్తుపల్లి లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.మ్యానిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత తీసుకుంటాం అని కార్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో నాల్గోసారి సండ్రను గెలిపించాలి కోరుకున్నారు.