89
శ్రీకాకుళం జిల్లా గార ఏస్ బి ఐ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాము తాకట్టు పెట్టిన బంగారం తమకు చూపించాలంటూ ఖాతాదారుల ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా తమ బంగారం కోసం బ్యాంక్ చుట్టు తిరిగిన ఖాతాదారులు గతంలో డిసెంబర్ 8 వ తేదీన ఆడిట్ చేసి బంగారాన్ని చూపిస్తానని ఏస్ బి ఐ రీజనల్ మేనేజర్ ప్రకటించారు. ఇంతలో బ్యాంక్ లో పనిచేస్తున్న డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ ఆత్మహత్య తో మేల్కోన్న SBI అధికారులు, నాలుగు కోట్ల రూపాయల విలువైన 7 కేజీల బంగారం పోయిందంటూ, బ్యాంక్ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం మిస్సైందన్న సమాచారంతో బ్యాంక్ ముందు భాదితులు ఆందోళన కు దిగారు.
Read Also..