81
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి హై స్కూల్ సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై వెనక నుండి కారును లారీ అతి వేగంగా ఢీకొట్టింది దీంతో ఆ కారు ముందు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్యలో కారు ఇరుక్కుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికుల్లో ప్రమాద స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. క్షతగాత్రుడిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.