84
శ్రీకాకుళం జిల్లా.. పలాస జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం పై బై పాస్ రోడ్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పలాస మండలం పెద్ద నీలావతి గ్రామానికి చెందిన బొంగు.సుందరరావు (40), మిన్నారావ్ (40) గా పోలీసులు గుర్తించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.