123
అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం ట్రంక్ రోడ్ వద్ద ద్వి చక్ర వాహనచోదకుడు నాసిర్ (17) బైక్ పై వెళుతూ అదుపు తప్పికింద పడిపోయిన నాసిర్ పై అదే దారిలో వెళుతున్న బస్సు వెనుక భాగంలో టైరు అతని పై ఎక్కడంతో తీవ్ర గాయాలు పాలైన నాసిర్ అక్కడిక్కడే మృతి చెందాడు. పుంగునురు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు మదనపల్లె నుంచి కడప కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయాచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాయచోటి పట్టణం మహబూబ్ నగర్ లో నివాసం ఉంటూ ద్విచక్ర వాహన మెకానిక్ గా పని చేస్తున్నట్లు వారి తల్లిదండ్రులు తెలియజేశారు. ప్రమాద సంఘటన పై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ యస్ ఐ రఫీ పేర్కొన్నారు.