తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది, ప్రమాదానికి గురైన లారీని వరుసగా మరో ఆరు లారీలు ఢీకొట్టడం తో నలుగురు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
fatal accident
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బండారుగూడెం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి అతివేగంగా రోడ్డు పక్కన నిలుచున్న యువకుడ్ని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన యువకుడు బండారు గూడెం వాసి మెడ బలిమి ప్రవీణ్ (19) గా గుర్తించారు. స్థానికులు సహాయంతో గన్నవరం మండలం చిన్న అవుటుపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పటల్ చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం ట్రంక్ రోడ్ వద్ద ద్వి చక్ర వాహనచోదకుడు నాసిర్ (17) బైక్ పై వెళుతూ అదుపు తప్పికింద పడిపోయిన నాసిర్ పై అదే దారిలో వెళుతున్న బస్సు వెనుక భాగంలో టైరు అతని పై ఎక్కడంతో తీవ్ర గాయాలు పాలైన నాసిర్ అక్కడిక్కడే మృతి చెందాడు. పుంగునురు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు మదనపల్లె నుంచి కడప కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయాచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాయచోటి పట్టణం మహబూబ్ నగర్ లో నివాసం ఉంటూ ద్విచక్ర వాహన మెకానిక్ గా పని చేస్తున్నట్లు వారి తల్లిదండ్రులు తెలియజేశారు. ప్రమాద సంఘటన పై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ యస్ ఐ రఫీ పేర్కొన్నారు.
అమెరికా లో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఇడాహో రాష్ట్రంలోని పొక్టాటెల్లో లోని ఇంటర్‌స్టేట్ 86 రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం రోడ్డును క్లియర్ చేసేందుకు సుమారు 7 గంటల సమయం పట్టినట్లు వారు వెల్లడించారు.
ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా హైవేపై వెహికల్స్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాల్లో మంటలు చెలరేగి 32 మంది మృతి చెందారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈజిప్ట్ రాజధాని కైరో నుంచి అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై.. నుబారియా టౌన్లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు కైరో వైపు వెళ్తూ.. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ తర్వాత ఆ మంటల్లోకి సుమారు 29 వెహికల్స్ దూసుకెళ్లినట్టు వెల్లడించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకొని మంటలు ఆర్పారు. అప్పటికే చాలా వెహికల్స్ మంటల్లో కాలిపోయాయి. వాహనాల్లోనే కొంతమంది సజీవ దహనమయ్యారు. కాగా, హైవేలపై భారీగా పొగమంచు ఉంటుందని ఈజిప్టు వాతావరణ అథారిటీ ఒక రోజు ముందే హెచ్చరించినట్టు తెలిపింది.






Total views : 77997