Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home International ఈజిప్ట్​లో ఘోర ప్రమాదం

ఈజిప్ట్​లో ఘోర ప్రమాదం

by Rama
Egypt road accident

ఈజిప్ట్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా హైవేపై వెహికల్స్​ ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాల్లో మంటలు చెలరేగి 32 మంది మృతి చెందారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈజిప్ట్​ రాజధాని కైరో నుంచి అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై.. నుబారియా టౌన్​లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు కైరో వైపు వెళ్తూ.. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ తర్వాత ఆ మంటల్లోకి సుమారు 29 వెహికల్స్​ దూసుకెళ్లినట్టు వెల్లడించింది. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది స్పాట్​కు చేరుకొని మంటలు ఆర్పారు. అప్పటికే చాలా వెహికల్స్​ మంటల్లో కాలిపోయాయి. వాహనాల్లోనే కొంతమంది సజీవ దహనమయ్యారు. కాగా, హైవేలపై భారీగా పొగమంచు ఉంటుందని ఈజిప్టు వాతావరణ అథారిటీ ఒక రోజు ముందే హెచ్చరించినట్టు తెలిపింది.

Advertisements

You may also like

Our Visitor

013689
Total views : 77954

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.