RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Advertisements

<p>ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో&comma; దర్శకుడిగా రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ &num;RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం<&sol;p>&NewLine;<p>ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం &num;RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు&period; ఎన్నో ఏళ్ల పాషన్&comma; ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు&period; రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు&period; రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రం ఈరోజు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది&period; నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అందజేశారు&period; ముహూర్తపు సన్నివేశానికి పి&period; మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా&comma; పి&period;వి&period; రవి కిషోర్ క్లాప్ కొట్టారు&period; దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది&period; కథానాయకుడు రామ్ పోతినేని చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు&period; నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నారు&period; ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను&comma; ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోంది&period;<&sol;p>&NewLine;<p>దర్శకత్వం&comma; కథతో పాటు ఈ చిత్రంలో రామ్ కథానాయకుడిగానూ నటిస్తున్నారు&period; కెమెరా ముందు&comma; వెనుక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకున్న అంకితభావం స్పష్టమవుతోంది&period; తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను ఆయన ఇందులో పోషించబోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు&period; తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది&period; జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు &lpar;తిరు&rpar; సినిమాటోగ్రఫీ అందిస్తుండగా&comma; ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు&period; ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>విభిన్నమైన కథ&comma; భారీ తారాగణం&comma; అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికతో తెరకెక్కుతున్న &num;RAPO23&comma; రామ్ పోతినేని కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలవనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.

హర్మన్ పోరాటం వృథా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు చేదు ఓటమి.