తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్లలో టికెట్‌ ధరలు పెంచకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.

తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్లలో టికెట్‌ ధరలు పెంచకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.

Advertisements

<p>సినిమా ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది&period; తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్లలో టికెట్‌ ధరలు పెంచకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు&period; &OpenCurlyQuote;అంతరించిపోతున్న సినిమా హాళ్లని కాపాడండి’ అన్న నినాదంతో మంగళవారం ఎగ్జిబిటర్లు మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ&period;&period; సింగిల్‌ థియేటర్ల మనుగడ కోసమే పర్సంటేజీ విధానం అడుతుగుతున్నామన్నారు&period; ఈ విధానానికి నటులు&comma; నిర్మాతలు సహకరించాలని కోరారు&period;<&sol;p>&NewLine;<p>సాధారణంగా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది&period; కానీ&comma; ప్రభుత్వం అటువంటి జీఓలు ఇచ్చినా కూడా తాము మాత్రం ధరలను పెంచబోమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు&period; సామాన్య ప్రేక్షకులకు ఇది ఒక రకమైన హామీ అని వారు తెలిపారు&period; తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది&period; మల్టీప్లెక్స్‌లకు వెళ్లలేని పేద&comma; మధ్యతరగతి ప్రజలకు సినిమా వినోదాన్ని చేరువ చేయడమే దీని అసలు ఉద్దేశం&period; టికెట్ రేట్లు పెరిగితే సామాన్యుడు థియేటర్లకు రావడం మానేస్తాడని&comma; అది వ్యవస్థకే ప్రమాదమని వారు అభిప్రాయపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి&period; నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి&period; ఈ పరిస్థితుల్లో తమ థియేటర్లను గోడౌన్లకు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని ఎగ్జిబిటర్ నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు&period; కేవలం సినిమా పట్ల ఉన్న మక్కువతోనే నష్టాలు వచ్చినా హాల్స్ నడుపుతున్నామని ఆయన వెల్లడించారు&period; ఇలాంటి క్లిష్ట సమయంలో నిర్మాతలే తమను ఆదుకోవాలని&comma; పర్సంటేజీల విషయంలో వెనక్కి తగ్గాలని కోరారు&period; ఒక ఊరిలో థియేటర్ మూతబడితే ఆ ఊరిలో ఒక సాంస్కృతిక కేంద్రం అంతరించిపోయినట్లేనని వారు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..