రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌ ..

రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌

Advertisements

<p>ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్‌&comma; హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు&period; ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు&period; అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్ సినిమాలా కనిపిస్తోంది&period; ఇప్పటికే టీజర్‌&comma; టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా&comma; ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyDoubleQuote;కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ మొదటి క్షణం నుంచే కథలోకి తీసుకెళ్లింది&period; సంజన RJ &amp&semi; సింగర్&period; తనకి చుపులేదు&period;&period; మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్&period; ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని చాలా ఎంటర్టైనింగ్ అలాగే ఎమోషనల్ గా చెప్పారు డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి<&sol;p>&NewLine;<p>ఈ కథని నేచురల్‌గా చూపించిన తీరు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది&period; ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా&comma; చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్‌తో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p>సూర్య వశిష్ట&comma; దీప్షిక చంద్రన్ కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించింది&period; ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు&comma; సంభాషణలు ట్రైలర్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి&period; ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p>కోర్ట్ ఫేం రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ ట్రైలర్‌కు మరో బలం&period; కొన్ని మాటలు నేరుగా హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>టెక్నికల్‌గా కూడా ట్రైలర్ మంచి ఇంప్రెషన్ ఇచ్చింది&period; సాఫ్ట్ విజువల్స్‌తో కెమెరా వర్క్ బాగుంది&period; బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది&period; మొత్తం మీద ట్రైలర్ అంతా ఒక క్లీన్ ఫీల్‌గుడ్ మూవీని ప్రామిస్ చేస్తోంది<&sol;p>&NewLine;<p>విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ ని నిర్మిస్తున్నారు&period; మే 22à°¨ విడుదల కానున్న రమణీ కళ్యాణం ప్రస్తుతం ట్రైలర్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని పెంచుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..