6 గంటలకు అమీర్‍‍పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..

6 గంటలకు అమీర్‍‍పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

Advertisements

<p>ఇవాళ టీడీపీ వ్యవస్థాపకుడు&comma; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి&period; ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి&period; జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎన్‌టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై రేవంత్‌ హామీ ఇచ్చారు&period; ఎన్‌టీఆర్‌ అభిమానుల చిరకాల కోరికను తాను నెరవేరుస్తానని చెప్పారు&period; ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్‌ యాదవ్‌&period;&period;13 అడుగుల ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయించారు&period;<&sol;p>&NewLine;<p>విగ్రహావిష్కరణ&comma; బహిరంగ సభ నేపథ్యంలో మైత్రీవనం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు&period; రాత్రి 10 గంటల వరకు మైత్రీవనం జంక్షన్‌లో ఆంక్షలుంటాయని తెలిపారు&period; అమీర్‌పేట్‌&comma; సత్యం థియేటర్‌&comma; ఎస్‌ఆర్‌నగర్‌&comma; సారథీ స్టూడియోస్‌ వైపు నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపునకు వచ్చే వాహనాలను వెంగళరావునగర్‌&comma; కళ్యాణ్‌నగర్‌&comma; కృష్ణకాంత్‌ పార్క్‌ వైపునకు పంపుతారు&period; 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సత్యం ధియేటర్‌ వైపు నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపునకు వెళ్లే వాహనాలను పంజాగుట్ట మీదుగా చెక్‌పోస్ట్‌ వైపునకు పంపుతారు&period; యూస్‌ఫగూడ నుంచి మైత్రీవనం వైపునకు వచ్చే వాహనాలను కృష్ణకాంత్‌ పార్క్‌&comma; కళ్యాణ్‌నగర్‌ వైపునకు మళ్లించారు&period; యూస్‌ఫగూడ బస్తీ వైపు నుంచి అమీర్‌పేట్‌కు వచ్చే వాహనాలను అల్‌సభా హోటల్‌ నుంచి వెంగళ్‌రావ్‌నగర్‌ వైపునకు పంపుతారు&period; వాహనదారులు ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని&comma; ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..