అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Advertisements

<p>రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు&period; జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు&comma; అధికారులతో సీఎం సమీక్ష చేశారు&period; ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు&period; యోగాంధ్ర -2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు&period; రాజధాని అమరావతిలో 25 వేల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు&period; రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ వంతెనపై యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు&period; వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న నిర్వహిస్తారు&period; అలాగే అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు&comma; జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు&period; యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో&comma; అన్ని స్థాయిల్లో&comma; అన్ని విభాగాల్లో నిర్వహించాలని సీఎం సూచించారు&period; మొత్తంగా కలిపి కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్దం చేశారు&period; రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1&period;50 లక్షల మంది ట్రైనర్లకు అందనంగా మరో లక్ష మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు&period; ఒక జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్ర నిర్వహిస్తారు&period; జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు జిల్లాకు రూ&period;25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..