కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం

Advertisements

<p>సముద్ర గర్భం కుచించుకుపోతోంది&period; నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి&period; సుప్రీంకోర్టు మార్గదర్శకాలు&comma; CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు&period; ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది&period; కృష్ణా జిల్లా బందరు రూరల్‌ మండలం పెదపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని 181&comma; 182&sol;1&comma; 182&sol;2&comma; 155&sol;A&comma; 155&sol;B లలో సుమారు 40 ఎకరాల అసైన్డ్&comma; దిబ్బ&comma; ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి&period; ఆక్రమణదారులు సముద్రానికి రక్షణగా ఉన్న మడ అడవులు నరికివేసి ఆ భూముల్లో చేపల చెరువులు తవ్వారు&period; ఆ ప్రాంతంలో తమకున్న 16 సెంట్ల భూమిని సాకుగా చూపుతూ ఈ భూకబ్జాకు పాల్పడినట్లు సమాచారం&period;&period;<&sol;p>&NewLine;<p>సుప్రీంకోర్టు మార్గదర్శకాలు&comma; CRZ నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్ల లోపు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడకూడదు&period; మడ అడవులు నరకడం&comma; భూముల ఆక్రమించి చెరువులు తవ్వడం&comma; పర్యావరణానికి విఘాతం కలిగించడం&comma; వన్యప్రాణులకి నష్టం కలిగించే చర్యలు చేపట్టడం చట్టరిత్యా కఠిన నేరం&period; కానీ పెదపట్నంలో కబ్జాదారులు ఇవేవీ లెక్కచేయడం లేదు&period; సుప్రీంకోర్టు మార్గదర్శకాలను&comma; CRZ నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>పెదపట్నంలో భూముల ఆక్రమణ&comma; మడ అడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది&period; సుప్రీంకోర్టు మార్గదర్శకాలు&comma; CRZ జోన్ వన్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారుల అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది GV రమణ జిల్లా కలెక్టర్ బాలాజీ ని కలిసి ఫిర్యాదు చేశారు&period; అంగర రంగనాథ్&comma; అంగర రామ్మోహన్ రావు&comma; అంగర వెంకట నవీన&comma; అంగర రమాదేవి&comma; అంగర రజిని&comma; అంగర అరుణ్ కుమార్ ఈ దారుణాలకు పాల్పడ్డారని&&num;8230&semi; బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>అడ్డగోలుగా చేపల చెరువులు తవ్వడంతో సముద్ర తీరం వెంబడి ఉన్న గ్రామాల పరిస్థితి దినదిన గండంగా మారుతోంది&period; కొందరు స్వార్థపరుల ధనదాహం వల్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని&period;&period; వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని&&num;8230&semi; కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని తీర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..