హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్

Advertisements

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు&period; ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్&comma; ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు&period; ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు&comma; తెలంగాణలో పార్టీ పరిస్థితి&comma; ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది&period; ఎస్ఐఆర్ ను తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం&period; తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల పురోగతిని&comma; బడ్జెట్ ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఖర్గేకు వివరించారు&period; రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం&comma; ప్రభుత్వ-పార్టీ సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు&period; ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో&period;&period; చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు&period; అలాగే కేబినెట్ విస్తరణ&comma; కొందరు మంత్రుల మార్పు&comma; పోర్ట్ ఫోలియోల మార్పు విషయాలపై చర్చలు జరుపుతున్నారు&period; ఈ వారంలోనే రాహుల్ గాంధీ&comma; కేసీ వేణుగోపాల్ తో కూడా ఈ అంశంపై చర్చించి&period;&period; జూన్ రెండోవారంలో కేబినెట్ విస్తరణ చేపడుతారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..