సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ “ఇడుపు కాయితం”

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ "ఇడుపు కాయితం"

Advertisements

<p>ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్&comma; జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్&comma; సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi;&period; ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది&period; తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi; సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు&period; ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది&period; ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్&comma; దిల్ రాజు&comma; నవీన్ యెర్నేని&comma; కేఎల్ దామోదరప్రసాద్&comma; ఎస్ కేఎన్&comma; బాపినీడు&comma; ధీరజ్ మొగిలినేని&comma; దర్శకులు మెహర్ రమేష్&comma; చందూ మొండేటి&comma; సాయి రాజేశ్&comma; వేణు ఊడుగుల&comma; సాయి మార్తాండ్ అతిథులుగా పాల్గొన్నారు&period; అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు&period; ఈ సందర్భంగా<&sol;p>&NewLine;<p>నటుడు బిత్తిరి సత్తి మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi; సినిమా ప్రారంభోత్సవం చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది&period; సావిత్రి&comma; సుజాత&comma;స అభయ్&comma; మైమ్ గోపి&period;&period;ఇలా మా అందరినీ ఈ సినిమాలోకి తీసుకొచ్చారు డైరెక్టర్ వంశీరెడ్డి&period; ఈ సినిమా టైటిల్ లోనే కాగితాలు చిరిగిపోతున్నాయి&period; రేపు థియేటర్స్ లో టికెట్స్ చిరగాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి సావిత్రి మాట్లాడుతూ &&num;8211&semi; నటిగా నా మొదటి సినిమా ఇది&period; ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వంశీ అన్నకు థ్యాంక్స్&period; ఈ సినిమాలో 80శాతం లేడీస్ ఉన్నాం&period; ఇలాంటి మంచి కథ ద్వారా మా అందరికీ అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి చంద్రవ్వ మాట్లాడుతూ &&num;8211&semi; బ్యూటిఫుల్ స్టోరీతో వస్తున్న చిత్రమిది&period; ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ లభించింది&period; త్వరలో మీరు ఈ సినిమా చూశాక ఈ పోస్టర్ గుర్తొస్తే ఎమోషనల్ అవుతారు&period; నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాలకు భిన్నమైన పాత్ర ఇది&period; స్మాల్ స్క్రీన్ మీద పేరు తెచ్చుకున్న మేము ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ మీద యాక్టర్స్ గా గుర్తింపు సంపాదించుకుంటామని నమ్మకం ఉంది&period; మా సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మరో హైలైట్ అవుతుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి జోర్దార్ సుజాత మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పను&period; నా క్యారెక్టర్ ఒక వర్గానికి ఇన్సిపిరేషన్ గా నిలిచేలా ఉంటుంది&period; అంతా మన వాళ్లే చేస్తున్నారు అనే ధీమా మా అందరిలో కనిపిస్తోంది&period; ఈ సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు రచ్చరవి మాట్లాడుతూ &&num;8211&semi; ఇది ఇడుపు కాయితం కాదు ఇది అందరినీ కలిపే కాయితం&period; ప్రతి కుటుంబాన్ని కలిపే కాయితం ఈ సినిమా&period; ఈ కథ ప్రతి ఇంటిది&comma; ప్రతి మనసుది&comma; ప్రతి ఆడబిడ్డది&period; ప్రియదర్శి&comma; బన్నీవాస్&comma; సుకుమార్ గారు&period;&period;ఈ ముగ్గురినీ కలిపింది మా డైరెక్టర్ వంశీ అన్న&period; తెలుగు సినిమా కథకు ఒక పూలదండ లాంటి కథ ఇది&period; నేను దర్శ కలిసి బలగం లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ చేశాం&period; ఈ సినిమా కూడా అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు మైమ్ మధు మాట్లాడుతూ &&num;8211&semi; ఈ కథ విని మేమంతా చలించిపోయాం&period; మేము నటించనక్కర్లేదు&comma; ఈ కథే మమ్మల్ని నడిపిస్తుంది అనే నమ్మకం కలిగింది&period; ఒక ఆణిముత్యం లాంటి కథతో దర్శకుడు వంశీ ఈ సినిమా రూపొందిస్తున్నారు&period; బలగం తర్వాత మరో గొప్ప నేటివిటీ సినిమా అవుతుంది&period; ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు అభయ్ బేతిగంటి మాట్లాడుతూ &&num;8211&semi; దర్శితో నేను మెమొరబుల్ మూవీస్ చేశాను&period; నా కెరీర్ లో మంచి మూవీస్ దక్కడం అదృష్టంగా భావిస్తా&period; అలాంటి మంచి చిత్రాల్లో ఇదొకటి&period; ఈ సినిమా గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు&period; సినిమానే మాట్లాడుతుంది&period; ఈ ప్రాజెక్ట్ గురించి ఏడాదిగా వింటున్నా&period; ఒక రోజు వంశీ అన్నీ ఆఫీస్ కు పిలిచాడు&period; ఈ సినిమా ఎలాగైనా చేయాలి అనుకుంటూ వెళ్లా&period; మంచి క్యారెక్టర్ ఇచ్చారు&period; ఈ క్యారెక్టర్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా&period; ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ &&num;8211&semi; ఈ కథ విన్న తర్వాత&comma; ఇంతమంది టీమ్ మెంబర్స్ ప్రాజెక్ట్ లోకి వచ్చాక&comma; నాకు ఒక్కటే అనిపిస్తోంది&period; ఈ &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi; పంచాయితీకి మూవీ రిలీజైన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూస్తారు&period; ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది&period; యూనివర్సల్ ఫిలిం&period; ఈ కథకు ప్రాంతంతో సంబంధం లేదు&period; ఇలాంటి మంచి మూవీకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ వంశీకృష్ణ దొండపాటి మాట్లాడుతూ &&num;8211&semi; మా &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi; సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్&period; ఈ కథ చెప్పగానే నమ్మి సినిమా చేస్తున్నామని గట్టిగా చెప్పిన మా ఆడబిడ్డ తబిత గారికి థ్యాంక్స్&period; నమ్మితేనే ఎవరైనా పైకి వస్తారు&period; తబిత గారికి&comma; సుకుమార్ గారికి&comma; బన్నీ వాస్&comma; దర్శి గారికి&comma; వేణు ఊడుగుల&comma; పూజారి నాగేశ్వరరావు&comma; బూసం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్&period; మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా&period; అన్నారు<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ తబిత సుకుమార్ మాట్లాడుతూ &&num;8211&semi; నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను&period; పక్కా తెలంగాణ అమ్మాయిని&period; డైరెక్టర్ వంశీ గారు ఈ కథ చెబుతున్నప్పుడు మేము చిన్నప్పుడు విన్న విషయాలు&comma; పెద్ద వాళ్లు ఎలా హ్యాండిల్ చేసేవాళ్లు&period;&period; అవన్నీ గుర్తొచ్చాయి&period; నేను ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయాను&period; ఈ కథ విన్నప్పుడు సుకుమార్ తో చెప్పాను&period; మీరు ఈ కథకు కనెక్ట్ అవుతున్నారో లేదో గానీ నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి చాలా కనెక్ట్ అయ్యాను&period; మనం ఎలాగైనా సుకుమార్ రైటింగ్స్ లో ఈ సినిమా చేయాలని&comma; మనం చేస్తున్నాం అంతే అని సుక్కుకు చెప్పాను&period; వంశీ ఈ క్యారెక్టర్స్&comma; ఎమోషన్స్ చాలా బాగా రాసుకున్నారు&period; వంశీ గారు కథ చెబుతున్నప్పుడే విజువల్ గా చూడగలిగాను&period; ఈరోజు పోస్టర్ చూశాక కూడా హ్యాపీ ఫీలింగ్ కలిగింది&period; సినిమా బయటకొచ్చాక ఇలా ఉంటుందేమో&comma; ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు అనిపించింది&period; మీరందరూ తప్పకుండా ఈ సినిమా కనెక్ట్ అవుతారు&period; సుకుమార్ రైటింగ్స్ లో ఇదొక మైల్ స్టోన్ లాంటి సినిమా అవుతుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ &&num;8211&semi; చాలా మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం&period; సబ్ టైటిల్స్ తో బిహార్ లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసే చిత్రమిది&period; మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది&period; అది పెళ్లయిన వారికి తెలుసు&period; ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్ కు వెళ్లండి&comma; అబ్బాయి అయితే అత్తామామను తీసుకుని విడిగా థియేటర్ కు వెళ్లండి&period; బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది&period; అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు&period; అంతవరకు ఈ కథను చెప్పగలను&period; వీళ్లందరూ బిజీగా ఉంటారు&period; వీళ్లు కథ వినగానే మేము మిగతా వర్క్స్ వదులుకుని అయినా ఈ మూవీ చేస్తామని ముందుకువచ్చారు&period; కథే వీళ్లందరినీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది&period; జమ్మికుంట నుంచి వచ్చాడు వంశీ&period; నేను ఆ ఊరు వెళ్లలేదు గానీ ఆయన కథ చెబుతుంటే ఊరు కళ్లముందు కనిపించింది&period; అంత బాగా కథ చెప్పాడు&period; &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi;తో ఒక మంచి తెలుగు సినిమా చూడబోతున్నాం&period; నేను సుకుమార్ కలిసి సినిమా నిర్మిస్తుంటే ఎవరైనా హ్యాపీగా వచ్చి చేస్తారనుకున్నా&period; కానీ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది&period; తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఏం చేయగలను&comma; ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుంది అనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైంది&period; నాగదుర్గ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకుంది&period; ఆమె కోసం ఒక స్పెషల్ ట్యూన్ చేయిస్తున్నాం&period; ఆ డ్యాన్స్ నెంబర్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి&period; ఈ సినిమా కథను మా దగ్గరకు తీసుకొచ్చి మేమంతా కలిసి ఈ మూవీ చేసేలా చేసింది ప్రియదర్శి&period; నేను ఈ మూవీ చేయకపోయి ఉంటే ఒక మంచి కథను మిస్ అయ్యేవాడిని&period; రైట్ టైమ్ లో నా దగ్గరకు వచ్చిన రైట్ ప్రాజెక్ట్ ఇది&period; ఈ మూవీ ఇక్కడిదాకా వచ్చేందుకు వేణు ఊడుగుల&comma; జగన్&comma; పూజారి నాగేశ్వరరావు హెల్ప్ చేశారు&period; వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా&period; మా టీమ్ అంతా కలిసి ఒక మంచి మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ &&num;8211&semi; యూట్యూబ్ లో నా పాటలు చూసి విని ఉంటారు&period; ఇప్పుడు &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi; అనే అద్భుతమైన మూవీతో మీ ముందుకు హీరోయిన్ గా వస్తున్నాను&period; ఇండస్ట్రీకి హీరోయిన్ గా రావాలని ఎంతోమంది అమ్మాయిలు కోరుకుంటారు&period; మీ అందరి సపోర్ట్ తో నాకు ఈ రోజు అవకాశం వచ్చింది&period; నేను ఈ స్టోరీని నమ్మాను&period; నన్ను ఈ స్టోరీ నమ్మింది&period; వంశీ గారు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా&period; ఈ అవకాశం కల్పించిన బన్నీ వాస్ గారికి&comma; సుకుమార్ గారికి థ్యాంక్స్&period; వాళ్లను కలిసినప్పుడు నా పాటలు చూస్తాం&comma; అభిమానిస్తాం అని చెప్పారు&period; టాలెంట్ ఎక్కడున్నా అది చేరుకోవాల్సిన చోటుకి చేరుకుంటుంది&comma; దక్కాల్సిన గుర్తింపు తీసుకొస్తుంది అని అన్నారు&period; వారి మాటలతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది&period; ఈ కథలో నేను చేస్తున్న శ్రీలత అనే పాత్ర చాలా బరువైంది&period; ఈ పాత్ర నేను చేయగలనా అని భయపడ్డాను&period; కానీ వంశీ గారు మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు&period; నా 25వ బర్త్ డే సుకుమార్ గారి సమక్షంలో జరుపుకోవడం మర్చిపోలేను&period; ఈ సినిమా కంటే బెస్ట్ ఎంట్రీ ఏం ఉంటుంది అనిపిస్తోంది&period; ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారో తెలిశాక మనోళ్లేరా&comma; అనే ధైర్యం వచ్చింది&period; ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తూ రచ్చ రచ్చ చేసేస్తారు అని చెప్పగలను&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో ప్రియదర్శి మాట్లాడుతూ &&num;8211&semi; ఈ రోజు &&num;8220&semi;ఇడుపు కాయితం&&num;8221&semi; లాంఛింగ్ ఈవెంట్ చూస్తుంటే హ్యాపీగా ఉంది&period; నేను గర్వంగా ఫీలయ్యే రోజు ఇది&period; మీరు నాపై చూపించిన ప్రేమను ఈ సినిమా ద్వారా తిరిగి మీకు అందించబోతున్నా&period; ఈ సందర్భంగా సుకుమార్ గారికి&comma; బన్నీ వాస్ గారికి&comma; తబిత గారికి థ్యాంక్స్ చెబుతున్నా&period; వీళ్లు మా మీద 200 పర్సెంట్ లవ్ చూపిస్తున్నారు&period; ఈ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్రలో కనిపించబోతున్నా&period; ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలో అదంతా చేస్తాను&period; ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయి ఉండొచ్చు&period; తెలంగాణ భాష&comma; యాస&comma; తిండి&comma; బట్ట అంతా కనిపించవచ్చు కానీ గర్వంగా చెప్పగలను ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా&period; ఈ సినిమాను మేము జమ్మికుంట&comma; ఇల్లంతకుంట&comma; హైదరాబాద్&comma; సనత్ నగర్ ఎక్కడ చిత్రీకరించినా&comma; ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి&period; ఇది నా ఇంట్లో ఉన్న కథ&period; వంశీ ఈ కథ చెప్పినప్పుడు ఇది నా కథ అని నమ్మాను&period; అలాగే మా టీమ్ అంతా నమ్మారు&period; ఇక మాటల్లేవు&comma; ఏం మాట్లాడినా చూపించి మాట్లాడుతాం&period; సినిమా ట్రైలర్ రిలీజ్ రోజు&comma; ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మా వాళ్ల అందరి గురించి మాట్లాడుతాను&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.