హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..

హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ

Advertisements

<p>స్టార్ గా&comma; పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే&period; ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి&period; హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద&comma; ఆ సినిమా సాధించిన సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది&period; కానీ జయాపజయాలకు అతీతంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎవరూ కదిలించలేని&comma; శంకించలేని స్థాయికి చేరుకున్నట్లు ఆయన లైనప్ చూస్తే తెలుస్తోంది&period; రౌడీ జనార్థన&comma; రణబాలి&comma; శౌర్యువ్&comma; వైరా బ్యానర్ కొత్త సినిమా&period;&period; ఈ మూడు చిత్రాలు ఏమాత్రం మారని విజయ్ స్టార్ డమ్&comma; రేంజ్ ను చూపిస్తున్నాయి&period; స్టార్ గా తను ఎదగడమే కాదు తన ఆకర్షణతో తెలుగు సినిమాను కూడా మరింత ఎత్తుకి తీసుకెళ్తున్నాడు విజయ్&period;<&sol;p>&NewLine;<p>నిర్మాతలు విజయ్ స్టార్ డమ్ ను&comma; థియేటర్ పుల్లింగ్ క్రేజ్ ను&comma; ఆయన స్టామినాను నమ్ముతున్నారు&period; దర్శకులు తాము ఊహించుకున్న పాత్రలను విజయ్ సమర్థవంతంగా పోషించగలడని&comma; ఆ పాత్రలకు లైఫ్ ఇవ్వగలడని విశ్వసిస్తున్నారు&period; ఫలితంగానే ఇంత వెర్సటైల్&comma; భారీ మూవీస్ ఆయనతో అనౌన్స్ చేస్తున్నారు&period; ఒక సినిమాను స్క్రిప్ట్ స్థాయిలోనే ఓన్ చేసుకుని&comma; ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడే విజయ్ తత్వం&comma; ప్యాషన్ మేకర్స్ కు ఎనలేని నమ్మకాన్ని కలిగిస్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p>విజయ్ కెరీర్ ప్రతి ఒక్కరికీ తెలిసిందే&period; మూవీ లవర్స్ కు ఆయన ఫిల్మోగ్రఫీలో 90 పర్సెంట్ ఫేవరేట్ మూవీస్ ఉంటాయి&period; అతి తక్కువ కాలంలో పాన్ ఇండియా ఆడియెన్స్ ఆదరణ&comma; ప్రేమ పొందడం విజయ్ ప్రత్యేకత&period; పెళ్లి చూపులు మూవీ విజయ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది&period; అర్జున్ రెడ్డి చిత్రంతో ఆయన టాక్ ఆఫ్ ది పాన్ ఇండియా అయ్యారు&period; ఆయన పర్ ఫార్మెన్స్ గురించి బాలీవుడ్ స్టార్స్ స్పందించారు&period; తమ ఫేవరేట్ యాక్టర్ అంటూ ఓపెన్ గా చెప్పుకున్నారు&period; విజయ్ లోని ఫైర్&comma; డెడికేషన్&comma; సడలని ఏకాగ్రత ఇవే ఆయనను స్టార్ గా నిలబెట్టాయి&period; టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే&period;&period;గీత గోవిందం ఆయన కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది&period; హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది&period; ఖుషి&comma; ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి&period; కల్కి చిత్రంలో అర్జునుడిగా మెరిశారు విజయ్ దేవరకొండ&period; ఆయనది అతిథి పాత్రైనా ఆ క్యారెక్టర్ గ్లింప్స్&comma; స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period; ఫ్యూచర్ లో ఎవరైనా మేకర్ మహాభారతంపై సినిమా చేస్తే అర్జునుడిగా విజయ్ దేవరకొండ పర్పెక్ట్ అనే ప్రశంసలు దక్కాయి&period; కింగ్డమ్ సినిమా విజయ్ ని కొత్తగా తెరపై ఆవిష్కరించింది&period;<&sol;p>&NewLine;<p>కరోనా టైమ్ లో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి&comma; పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు&comma; ఇతర సహాయం అందించాడు&period; యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు&period; దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు&period; తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు‌ చేయిస్తారు విజయ్&period; ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు&period;<&sol;p>&NewLine;<p>ఏ పరిస్థితిలోనైనా తనకు అండగా నిలబడి ప్రోత్సహించే అభిమానులంటే విజయ్ కు ప్రాణం&period; తనను ప్రేమించే వాళ్ల గురించి సోషల్ మీడియా ద్వారా దృష్టికి వస్తే తప్పకుండా వాళ్లను కలుస్తారు&period; ఇటీవల ఓ పాప తనను విజయ్ వివాహానికి పిలవలేదని పోస్ట్ పెడితే&comma; ఇంటికి పిలిచి దగ్గరుండి భోజనం పెట్టించి&comma; ఆమెకు ఫొటోస్ ఇచ్చారు&period; తన అభిమానులు ఎక్కడున్నా&comma; ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించడం విజయ్ హ్యుమానిటికీ నిదర్శనం&period; నటనతో పాటు విజయ్ కు బిజినెస్ అంటే ఇష్టం&period; రౌడీ వేర్ ను సక్సెస్ ఫుల్ బ్రాండ్ గా నిలబెట్టి ప్రతిభ గల బిజినెస్ మెన్ అనిపించుకున్నారు విజయ్&period; ఏషియన్ విజయ్ మల్టీప్లెక్స్ నిర్మాణం&comma; రెస్టారెంట్ నిర్వహణతో విజయ్ మల్టిపుల్ బిజినెస్ ప్లాట్ ఫామ్స్ ను తన ప్యాషన్ తో కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇటీవలే విజయ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు&period; తన స్నేహితురాలు&comma; కోస్టార్ రశ్మికను పెళ్లి చేసుకున్నారు&period; వీరి వివాహం జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించింది&period; విరోష్ పెళ్లికి సంబంధించిన ప్రతి విశేషం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ప్రధాని మోదీ ఆశీస్సులతో పాటు ఎందరో ప్రముఖ సినీ&comma; రాజకీయ&comma; క్రీడా&comma; వ్యాపారవేత్తలు&comma; వివిధ రాష్ట్రాల అభిమానులు&comma; ప్రజలు విరోష్ ను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు&period; తమ పెళ్లి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన దేవాలయాల్లో అన్నదానం&comma; స్వీట్స్ పంపిణీ చేశారు విజయ్&comma; రశ్మిక జంట&period; సొంత ఊరు అంటే విజయ్ కు చాలా ఇష్టం&period; నాగర్ కర్నూల్ జిల్లా&comma; బల్మూరు మండలం తుమ్మన్ పేట విజయ్ సొంతూరు&period; పెళ్లయ్యాక తుమ్మన్ పేట వెళ్లి అక్కడి గ్రామ ప్రజల ఆశీస్సులు తీసుకున్నారు విజయ్&comma; రశ్మిక జంట&period; తుమ్మన్ పేట ప్రభుత్వ పాఠశాలలో చదివే 9&comma; 10 à°µ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చి మొదటి&comma; ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తానని విజయ్ ప్రకటించారు&period; వచ్చే విద్యా సంవత్సరం నుంచి అచ్చంపేట డివిజన్ లోని 44 పాఠశాలల్లో ఈ స్కాలర్ షిప్స్ ఇస్తామని ఆయన తెలిపారు&period; విజయ్ చేపట్టిన ఈ ఛారిటీ కార్యక్రమం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి&period;<&sol;p>&NewLine;<p>విజయ్ లైనప్ లో ఉన్న మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు సమీప భవిష్యత్ లో విజయ్ ఏ స్థాయిలో ఉండబోతున్నాడు అనేది హింట్ ఇస్తున్నాయి&period; దిల్ రాజు&comma; శిరీష్ నిర్మాణంలో దర్శకుడు రవికిరణ్ కోలా రూపొందిస్తున్న రౌడీ జనార్థన మూవీ విజయ్ లోని మాస్ యాంగిల్ ను కంప్లీట్ గా తెరపైకి తీసుకురానుంది&period; ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది&period; డిసెంబర్ లో రౌడీ జనార్థన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది&period; అలాగే మైత్రీ మూవీ మేకర్స్&comma; టీ సిరీస్ నిర్మాణంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న రణబాలి సినిమా భాషలకు అతీతంగా మోస్ట్ అవేటెడ్ మూవీగా క్రేజ్ తెచ్చుకుంటోంది&period; ఈ సినిమా నుంచి రిలీజ్ టైటిల్ గ్లింప్స్&comma; ఏందయ్యా సామీ పాట వైరల్ గా మారాయి&period; &&num;8220&semi;రణబాలి&&num;8221&semi;తో విజయ్&comma; రశ్మిక జోడి మరోసారి ప్రేక్షకులను అలరించనుంది&period; సెప్టెంబర్ 11à°¨ ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది&period; ఇక తాజాగా ప్రకటించిన శౌర్యువ్&comma; వైరా బ్యానర్ మూవీతో విజయ్ ఇండియన్ సినిమాను మరో ముందడుగు వేసేలా చేశారు&period; ఈ సినిమాకు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం విశేషం&period; వారణాసి&comma; రాకా వంటి ప్రెస్టీజియస్ మూవీస్ తో విజయ్&comma; శౌర్యువ్ మూవీకి పోలికలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p>ఇదంతా కేవలం పదిహేనేళ్ల కెరీర్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక ఔట్ సైడర్ గా ఇండస్ట్రీకి వచ్చి విజయ్ దేవరకొండ సాధించిన విజయాలు&period; ఆయన మాటల్లో వింటే &&num;8211&semi; హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం&comma; ఇంతమంది అభిమానం పొందడం నాకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది&period; ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం&period; మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు&period; నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా&period; ప్రతి ఇండస్ట్రీ కొత్త ప్రయత్నం చేసేందుకు స్ట్రగుల్ పడాలి&period; అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు&period; అంటారు విజయ్<&sol;p>&NewLine;<p>ఈ పుట్టినరోజు విజయ్ దేవరకొండకు మరింత స్పెషల్ గా ఉండాలని కోరుకుంటూ&period; ఆయనకు పుట్టినరోజు విశెస్ చెబుదాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..