ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక&comma; విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది&period; శాఖ ఆధునికీకరణలో భాగంగా మొత్తం 252&period;93 కోట్లతో చేపట్టిన ప్రణాళికలో తొలి దశగా 33&period;25 కోట్ల విలువైన నూతన వాహనాలు&comma; అత్యాధునిక పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు&period; అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జెండా ఊపి కొత్త వాహనాలను సేవలకు అంకితం చేశారు&period; అధికారులు కొనుగోలు చేసిన పరికరాలు&comma; వాహనాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు&period; తొలి విడతలో భాగంగా 18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు&comma; 10 కోట్లతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు&comma; 2&period;49 కోట్లతో 50 అత్యవసర రబ్బర్ బోట్లు&comma; 2&period;08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను ప్రభుత్వం సమకూర్చింది&period; కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించుకుని ఈ పరికరాలను అందుబాటులోకి తెచ్చిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు&period; రాజధానితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాల నిర్మాణాలు పెరుగుతున్నందున&comma; వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు&period; గతంలో అగ్నిమాపక విభాగంలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేదని&comma; మళ్లీ అదే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు&period; విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సైతం సహాయం చేసిన ఘనమైన చరిత్ర ఏపీకి ఉందని గుర్తుచేశారు&period; అన్ని సవాళ్లను అధిగమించి&comma; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమర్ధంగా సద్వినియోగం చేసుకుని అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత&comma; స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్&comma; అగ్నిమాపక శాఖ డీజీ&comma; హోంశాఖ ముఖ్య కార్యదర్శి &comma; పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.

ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.

తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.