తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోంది.

Advertisements

<p>తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోంది&period; సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా తన ప్రసంగాలలో క్రీడలపై మక్కువ చూపిస్తున్నారు&period; ఇటీవల క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని కూడా ప్రకటన చేశారు&period; ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో మాత్రం ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు వెనుకబడుతున్నాయి&period; క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలసముద్రంలో కొనసాగు తున్న బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు మూగనోము పట్టాయి&period; ఇండోర్ స్టేడియంలోని ఉడెన్ కోర్టు&comma; మ్యాట్లు&comma; విద్యుత్ లైట్లు&comma; రేకులు&comma; కిటికీల సుందరీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి&period; ఇండోర్ స్టేడియం నత్తనడకన సాగుతున్న విధానం పై సీవీఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ<&sol;p>&NewLine;<p>హనుమకొండలో ఏడాది కిందట చేపట్టిన ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ముందుకు సాగటం లేదు&period; పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు జరగడం లేదు&period; గతేడాది ఏప్రిల్ లో DSA నిధుల నుంచి 68 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు&period; స్టేడియం మర మ్మతు&comma; సుందరీకరణ పనులకు వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి&comma; ఎంపీ కడియం కావ్య లాంఛనంగా శంకు స్థాపన చేశారు&period; కలెక్టర్&comma; అధికారులు పర్యవేక్షిస్తున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు&period;<&sol;p>&NewLine;<p>రెండు నెలల్లో స్టేడియం అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సి ఉండగా&period;&period; కొన్ని నెలలుగా ఇండోర్ స్టేడియంలో సుందరీకరణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి&period; బ్యాడ్మింటన్ శిక్షణ పొందే వర్ధమాన క్రీడా కారులు పనులు పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు&period; ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనుల్లో జాప్యం కారణంగా క్రీడాకారులు హనుమకొండ సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో తాత్కాలికంగా శిక్షణ పొందు తున్నారు&period; ఆఫీసర్స్ క్లబ్ స్టేడియంలో ఫీజులు ఎక్కువగా ఉండటం&comma; ఇక్కడ గతంలో శిక్షణ తీసుకునే వారికే క్లబ్ నిర్వాహకులు ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్ర&comma; జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు వస్తున్నాయి&period; కానీ ఇంకా ఇండోర్&comma; స్విమ్మింగ్ పూల్ పనులు పూర్తి కాకపోవడంతో వర్ధమాన క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<br &sol;>&NewLine;ఇంత జరుగుతున్నా&period; DSA అధికారులు పట్టించుకోక పోవడంతో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు&period;&period; ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇండోర్ స్టేడియం పనులతోపాటు స్విమ్మింగ్ పూల్ ను అందు బాటులోకి తీసుకురావాలని క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.