రెండు భారతీయ వాణిజ్య నౌకలపై కాల్పులు ..

Advertisements

<p>చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు జరిపిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది&period; ఆ ఘటనపై వివరణ కోరుతూ దిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి&period; అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన మార్గంలో జరిగిన ఆ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది&period; ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల ప్రకారం&comma; ఇరాన్&ZeroWidthSpace;కు చెందిన గన్&ZeroWidthSpace;బోట్లు హెచ్చరిక కాల్పుల్లో సిబ్బందికి ఎలాంటి గాయాలు జరగలేదు&period; నౌకలకు కూడా పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది&period; అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ రెండు నౌకలు తమ ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసి&comma; ఒమన్‌కు ఈశాన్య దిశగా వెనక్కి మళ్లినట్లు సమాచారం&period; దాడికి గురైన నౌకల్లో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ గా గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p>భారీ పరిమాణంలో ఉండే ఆ ట్యాంకర్లు ముడి చమురును సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగిస్తారు&period; ఇలాంటి నౌకపై కాల్పులు జరగడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది&period; ఇటీవల హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్&comma; ఒక్క రోజులోనే మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది&period; తమపై అమెరికా విధించిన దిగ్బంధనం కొనసాగుతున్నంతకాలం&comma; హర్మూజ్ గుండా నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ఇరాన్ పేర్కొంది&period; ఆ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే భారత నౌకలపై కాల్పులు జరగడం గమనార్హం&period; ఈ ఘటనను బ్రిటన్ సైన్యం కూడా ధ్రువీకరించినట్లు సమాచారం&period; ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో జలసంధిలో రవాణాకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నప్పటికీ&comma; క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది&period; సముద్ర కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ముందస్తు అనుమతి లేకుండా వస్తున్న నౌకలను అడ్డుకుంటూ హెచ్చరిక కాల్పులకు దిగుతున్నట్లు సమాచారం&period; పరిస్థితిని సమీక్షిస్తున్న భారత్&comma; అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..