66
అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్ల నిర్వహణకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక శబరిమల సీసన్ స్పేషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్- కొల్లాం, నర్సాపూర్- కొట్టాయం, కాచిగూడ- కొల్లాం, కాకినాడ టౌన్- కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్సీఆర్ వెల్లడించింది. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయని పేర్కొంది. అలాగే రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌకర్యాలను వినియోగించుకుని సురక్షిత దర్శనం చేసుకుని తిరిగి ఇళ్లకు చేరాలని రైల్వే అధికారులు తెలిపారు.