ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం. రాయనపాడు(Rayanapadu) లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. గ్రానైట్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు రాయనపాడు స్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది. యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు, మరియు సిబ్బంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
తప్పిన పెను ప్రమాదం. రాయనపాడు స్టేషన్ సమీపంలో ఘటన. రాయణపాడు స్టేషన్ దాటగానే పట్టాలు తప్పి ట్రాక్ పైకి ఒరిగిపోయిన నాలుగు వ్యాగన్స్, రాత్రి 9 గం సమయంలో ప్రమాదం.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న విజయవాడ డివిజన్ రైల్వే ఇంజనీరింగ్ అదికారులు… కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్తున్న గూడ్స్ రైలు.. గ్రానైట్ స్టోన్స్ తో పోర్టుకు వెళ్తున్న గూడ్స్ రైలు.. ఇందువలన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. విజయవాడ హైదరాబాద్ రూట్లో పలు రైళ్ల దారి మళ్లింపు.. విజయవాడ టూ హైదరాబాద్ వెళ్లే పలు రైళ్లు దారి మల్లింపు.. మచిలీపట్నం బీదర్ , కాకినాడ పోర్టు లింగంపల్లి , గూడూరు సికింద్రాబాద్ రైళ్లను దారి మల్లింపు.. వయా గుంటూరు మీదుగా సికింద్రాబాద్ తరలిస్తున్న రైల్వే అధికారులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.