చేనేత వస్త్ర ప్రదర్శన….

Handloom Textile Show....

Advertisements

&NewLine;<p>చేనేత కార్మికులను ఆర్థికంగా&comma; సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా వారికి సహకారం అందిస్తూ &period;&period; చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ కె&period; వెంకటరమణారెడ్డి తెలిపారు&period; బుధవారం స్థానిక తిరుచానూరు శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన – 2023 కార్యక్రమంను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు&period; ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ&period;&period; చేనేత కార్మికులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు&period; వారి కష్టాలను గుర్తించి తోడ్పాటును అందించేలా వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరు కొనుగోలు చేయాలని అన్నారు&period; చేనేత కార్మికులు తయారుచేసిన నాణ్యమైన అన్ని రకాల వస్త్రాలు ఆరోగ్యకరమైనవి ఎలాంటి హానికర పదార్థాలు వాడరని తెలిపారు&period; అన్ని సీజన్లోనూ లో ప్రతి ఒక్కరు ధరించేలా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు&period; అన్ని రకాల వెరైటీలు చాలా తక్కువ రేటుతో ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు&period; చేనేత కార్మికులు సొంత మగ్గాలు ద్వారా తయారుచేసిన నాణ్యమైన మరియు వైవిద్యమైన ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం కొరకు సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని&comma; ఈ ఎగ్జిబిషన్ నందు ధర్మవరం&comma; వెంకటగిరి&comma; శ్రీకాళహస్తి&comma; ఉప్పాడ&comma; నారాయణవరం&comma; మంగళగిరి&comma; చీరాల&comma; మాధవరం &comma; హ్యాండి క్రాఫ్ట్&comma; బెడ్ షీట్స్ వంటివి అందుబాటులో ఉంచడం జరిగిందని పండుగలు సందర్భంగా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ&period;&period; రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నేటి నుండి జనవరి 2 వరకు 14 రోజులు నిర్వహించనున్నారని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఉత్పత్తి అయినటువంటి చేనేత రకాలు అందుబాటులో కలవని తెలిపారు&period; ఉత్పత్తి ధరలకే నేరుగా చేనేత కళాకారుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు&period; రాష్ట్ర&comma; కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను తిరుపతి పుర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఎ à°¡à°¿ పిచ్చెశ్వర రావు&comma; డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.