కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో ఆమె స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు నిధులు ఆపేశామని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని ఒక్క కేసీఆర్ మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ఆలోచించే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతుల కోసం రూ.25వేల కోట్లు వదులుకోవటానికి కేసీఆర్ సిద్ధపడ్డారని తెలిపారు. రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉందన్నారు. అలాంటిది ఓట్ల సమయంలో నిర్మలా సీతారామన్ వచ్చి తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు.
సీతారామన్ కు హరీశ్ రావు కౌంటర్..!
69
previous post